ప్రస్తుతం హీరోలు ,హీరోయిన్ లు కెరీర్ పై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు..తమ సినీ కెరీర్ గురించి ఆలోచిస్తూ పర్సనల్ లైఫ్ వదిలేస్తున్నారు .జీవితంలో పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యం కాదని వారు భావిస్తున్నారు.పెళ్లి ఎప్పుడు అంటే ఏదోకటి చెప్పి అప్పటికి తప్పించుకుంటున్నారు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్గా వున్నారు.అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వున్నారు .ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే సల్మాన్ ఖాన్ కు 60 ఏళ్లు వస్తాయి.దీనితో ఇకపై ఆయన పెళ్లి చేసుకోకపోవచ్చు. ఇక ప్రభాస్ కూడా 40 ప్లస్ ఏజ్ లో ఉన్నారు.ప్రభాస్ ను పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా త్వరలోనే అంటూ మాట దాటేస్తూ వుంటారు.దీనిని బట్టి ప్రభాస్ కు పెళ్లి ఫై ఆసక్తి లేదేమో అనే భావన కలుగుతుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి మేటర్ మరోసారి తెరపైకి వచ్చింది. హీరో విశాల్ తన లేటెస్ట్ మూవీ “రత్నం” ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి విశాల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు . నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కాగానే అందులో పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా అని ప్రశ్న అడగగా ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే నా పెళ్లి ఉంటుందని విశాల్ అన్నారు.అలాగే తన పెళ్లి మొదటి కార్డు కూడా ప్రభాస్ కే ఇస్తాను అని అన్నారు. దీనితో వీరెవరికీ ప్రస్తుతం పెళ్లిపై ఆసక్తి లేదని అర్ధం అవుతుంది .అయితే హీరో విశాల్ కి గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది.కొన్నికారణాలతో ఆ వివాహం ఆగిపోయింది.దీనితో ప్రస్తుతానికి విశాల్ కి పెళ్లి గురించి ఇంట్రెస్ట్ లేక అలాంటి సమాధానం ఇచ్చారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.