Isro: శక్తివంతమైన “సౌర తుఫాను” నుంచి ఇస్రో మన శాటిలైట్లను ఎలా రక్షించింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isro: ఇటీవల సూర్యుడి నుంచి వెలువడని కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) వల్ల శక్తివంతమైన సౌర తుఫాను ఏర్పడింది. ఇది భూమిపై ‘భూఅయస్కాంత తుఫాను’ను ప్రేరేపించింది. గత దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సౌర తుఫాను తీవ్రత ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ తుఫాను ధాటికి శాటిలైట్లతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ గ్రిడ్స్‌కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్‌కి చెందిన ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్లు కూడా ఈ సౌర తుఫాను ధాటికి ఒత్తిడికి గురయ్యాయని, సేవల్లో క్షీణత ఎదుర్కొన్నట్లు సంస్థ పేర్కొంది.
మే 8, 9న రెండు దశాబ్ధాల తర్వాత వచ్చిన బలమైన సౌర తుఫాను నుంచి భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) తన శాటిలైన్లను సురక్షితంగా రక్షించింది. భూమినే కాకుండా చంద్రుడిని కూడా ఈ సౌర తుఫాను తాకింది. భూమి, చంద్రుడి చుట్టూ భారతదేశానికి చెందిన మొత్తం 50కి పైగా శాటిలైట్లు ఉన్నాయి. సూర్యుడిపై కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల భారీగా ప్మాస్లా సౌరవ్యవస్థలోకి వెదజల్లబడింది. ఇది ఉపగ్రహాలను ప్రమాదంలో పడేశాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Attack On Man: వాయిదాలు మిస్సయినందుకు వ్యక్తి పై దాడి చేసిన ఫైనాన్స్ కంపెనీ లోన్ ఏజెంట్..
ప్రస్తుతం సూర్యడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో భాగంగా గరిష్ట స్థితికి చేరుకున్నారు. ఈ సౌరచక్రంలో సూర్యుడి మాగ్నెటిక్ పోల్స్ రివర్స్ అవుతాయి. ఆ సమయంలో సూర్యుడి చాలా క్రియాశీలకంగా ఉంటాడు. దీంతో సూర్యడి నుంచి సౌరజ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ విండ్ రూపంలో శక్తి విడుదల అవుతుంది. సూర్యుడి నుంచి ఆవేశిత కణాలు భూమిని చేరుతాయి. అయితే, భూమికి ఉండే బలమైన ‘‘అయస్కాంత క్షేత్రం’’ వీటి నుంచి భూమిని రక్షిస్తుంది. ఇది ఓ బుడగ మాదిరిగా భూమి చుట్టూ అంతరిక్షంలోకి వ్యాపించి ఉంటుంది. సోలార్ కాస్మిక్ కిరణాలను ఎప్పటికప్పుడు భూమి అయస్కాంత క్షేత్రం నెట్టేస్తుంది. అయితే, ఇది శాటిలైట్లతు, కమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్స్, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్స్‌కి నష్టాన్ని కలిగించవచ్చు. రేడియేషన్ ఫలితంగా వ్యోమగాములు, విమాన ప్రయాణికులు ప్రభావితం కావచ్చు.
Read Also: RAJASTHAN: మూడేళ్ల పాపను కారులో మరిచి వెళ్లిన తల్లిదండ్రులు.. చివరకు విషాదం మిగిలింది..
ఇస్రో అప్రమత్తం:
ఈ భారీ సౌరతుఫానుతో ఇస్రో అప్రమత్తం అయింది. కర్నాటకలోని హసన్ మరియు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఇస్రో యొక్క మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (MCF) మన గ్రహం చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలను అవిరామంగా పర్యవేక్షించడానికి మరియు రక్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎంసీఎఫ్ శాటిలైట్ల ఇనిషియల్ ఆర్బిట్ రైజింగ్, ఇన్-ఆర్బిట్ పేలోడ్ టెస్టింగ్ మరియు ఆన్-ఆర్బిట్ కార్యకలాపాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కార్యకలాపాలలో నిరంతర ట్రాకింగ్, టెలిమెట్రీ మరియు కమాండింగ్ ఉంటాయి.
సోలార్ మెటిరియల్ భూమి వైపు వేగంగా రావడంతో అప్రమత్తంగా వ్యవహరించింది. దీని ఫలితంగా స్పేస్ క్రాఫ్ట్‌లో మూమెంటమ్ వీల్ స్పీడ్, ఎలక్ట్రిక్ కరెంట్స్ వ్యత్యాసాలను గమనించవచ్చు. దీంతో ఇస్రో శాటిలైట్లలోని కొన్ని సెన్సార్లు, ముఖ్యమైన కొన్ని వ్యవస్థలను క్రియారహితంగా మార్చాయి. అంతే కాకుండా ఇస్రో యొక్క 30 జియోస్టేషనరీ ఉపగ్రహాల నెట్‌వర్క్ క్షీణించబడలేదని ఇస్రో నిర్ధారించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..