Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 3-1తో భారత జట్టును ఓడించింది. దీంతో కంగారూ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ.. ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ కు ఆగ్రహం తెప్పించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1996-97 నుంచి భారత క్రికెట్ జట్టు- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది.
న్యూజిలాండ్‌తో ముంబైలో జరగనున్న మూడో టెస్టు కోసం ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మంగళవారం (అక్టోబర్ 29) జట్టులోకి వచ్చాడు. సిరీస్ ప్రారంభంలో అతను టీమిండియాలో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత అస్సాంతో ఢిల్లీ రంజీ ట్రోఫీ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆడేందుకు వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు హర్షిత్ ఎంపికయ్యాడు.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్'లో చోటు దక్కించుకుంది. ఈ 'టీమ్ ఆఫ్ టోర్నీ'లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది.
టీం ఇండియా ప్రధాన కోచ్‌కు సంబంధించి కొనసాగుతున్న ప్రకంపనల మధ్య, గంభీర్ స్పందించారు. భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా మారే ప్రశ్నపై గౌతమ్ గంభీర్ శుక్రవారం మాట్లాడుతూ.. తాను అంత దూరం చూడడం లేదని అన్నారు.
ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2024 జూన్ 1 నుండి వెస్టిండీస్, అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది. అయితే.. టీమిండియాలో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. అతనికి పోటీగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు…