IND vs SL: శ్రీలంక 170 ఆలౌట్.. తొలి టీ-20లో భారత్ ఘన విజయం
- 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌట్
- తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL: కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 26 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. జవాబుగా, శ్రీలంక పూర్తి శక్తితో పోరాడింది. అయితే చివరి ఓవర్లలో దాని బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని తట్టుకోలేక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(79), కుశాల్ మెండిస్(45) దూకుడుతో ఆ జట్టు ఓ దశలో విజయం వైపు దూసుకెళ్లింది. కానీ వీరిద్దరూ ఔటయ్యాక మిడిలార్డర్ కుప్పకూలడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీయగా.. అర్షదీప్, అక్షర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
Read Also: WhatsApp: భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా..? కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తొలుత టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ జోడీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది. సూర్యకుమార్ 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 58 పరుగులు చేశాడు. పంత్ కూడా ధాటిగా ఆడుతూ 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) పతిరణ బౌలింగ్ లోనే అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!