కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
Suryakumar Yadav Heap Praise on Rohit Sharma Captaincy: శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో భారత్ తొలి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ తొలిసారి ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడిన సూర్య టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు ఇష్టమైన కెప్టెన్ రోహిత్ అని.. ఆటగాడిగా, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. కెప్టెన్సీ మార్పు…
IND vs SL 1st T20 Prediction and Playing 11: భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. పల్లెకెలె స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు మొదటి టీ20 ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ, జింబాంబ్వే సిరీస్ గెలిచిన టీమిండియా.. లంకపై కూడా గెలవాలని చూస్తోంది. వరుస ఓటములు ఎదుర్కొంటున్న లంక ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. ఇక రోహిత్…