IND vs PAK T20 World Cup: 2026 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒక పండుగలా మారబోతుంది. అండర్-19 వరల్డ్ కప్ నుంచి మెన్స్ టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్ వరకూ అన్ని వర్గాలు, అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి పోటీలు జరగబోతున్నాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని, పాకిస్తాన్ జట్టును కూడా భారతదేశానికి రావడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు , ఆసియా కప్, ఐసిసి టోర్నమెంట్లు వంటి బహుళ-దేశాల టోర్నమెంట్లను విడివిడిగా పరిగణిస్తారు. ఈ టోర్నమెంట్లు తటస్థ వేదికలో జరిగితే భారతదేశం వాటిలో పాల్గొనవచ్చు. భారత విధానంలో ఎటువంటి మార్పు లేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రశ్నే లేదని…