India vs Australia: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన భారత్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి పరుగులు 264 సాధించింది భారత్. ఆస్ట్రేలియా టార్గెట్ 265 పరుగులుగా నిర్దేశించింది.
READ MORE: Bihar Elections: బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన.. ఎవరంటే..!
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోనే దెబ్బ పడింది. కేవలం 17 పరుగుల వద్ద కెప్టెన్ శుభ్ మాన్(9) ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్ లెట్ చేతిలో పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్‌లో విరాట్ కోహ్లీ(0) ఔట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్ లో కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ 74 బంతుల్లో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంతలో, శ్రేయాస్ అయ్యర్ 67 బంతుల్లో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ స్టార్క్ చేతిలో రోహిత్(73 ) వెనుదిరిగాడు. రోహిత్ 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. రోహిత్ అవుట్ అయిన కొద్దిసేపటికే శ్రేయాస్(61) సైతం పెవిలియన్‌కు చేరరాడు. శ్రేయాస్ 77 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ (11), వాషింగ్టన్ సుందర్ (12), నితీష్ రెడ్డి (8)తో వెంట వెంటనే ఔట్ అయ్యారు. అక్షర్ పటేల్ 44 పరుగులు చేయడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటింది. అక్షర్ పటేల్ (44) కాస్తలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి.. మిచెల్ స్టార్క్ కి క్యాచ్ ఇచ్చాడు. ఆఖర్లో దూకుడుగా హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ దూకుడుగా ఆడారు. ఇంతలో అర్ష్‌దీప్ (13)ను మిచెల్ స్టార్క్ బౌల్డ్ చేశాడు. మరోవైపు.. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4, బార్ట్‌లెట్ 3, మిచెల్ స్టార్క్‌కు 2 వికెట్లు పడగొట్టారు.