పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల తుర్కియేకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక ఇటీవల పాకిస్థాన్ కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయా.. రానున్న కొన్నిరోజుల్లో పాకిస్థాన్‌పై భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక వేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన దేశంలోని ఏఏ రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Yamadonga : యమదొంగ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
భారతదేశం- పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. జమ్ము కశ్మీర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. వాస్తవానికి .. జమ్ము&కశ్మీర్ ప్రాంతం భారత్-పాక్ మధ్య వివాదాస్పదంగా కొనసాగుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సరిహద్దు. ఈ ప్రాంతాల్లో యుద్ద ప్రభావం అధికంగా ఉంటుంది. కాగా.. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారత్-పాక్ సరిహద్దులో ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. సరిహద్దు నగరాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది.
READ MORE: India Pakistan: పాకిస్తాన్‌తో వరద హెచ్చరికలు.. చీనాబ్ నది గేట్లు ఎత్తేసిన భారత్..!
కాగా.. భారత ప్రభుత్వం ఇప్పటికే అన్నింటికీ సిద్ధమైంది. తాజాగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశం నుంచి దాడులు జరిగితే.. ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన (బుధవారం) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో తాజాగా కీలక భేటీ జరిగింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా ఈ సమావేశంలో విభజించారు. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరి 1లో పెట్టారు. ఇక కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు.
