ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే వన్డే మరియు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.అసలు ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం అక్కడి పరిస్థితులే. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 టీ20లు ఆడనుంది. అయితే భారత ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి…
భారతదేశం మరోసారి విదేశీ గడ్డపై తన దౌత్య మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారత పౌరుల కోసం ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్ తమ పౌరులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా ఇరాన్ భారతీయ విద్యార్థుల కోసం టెహ్రాన్ తన గగనతలాన్ని తెరిచింది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
పహల్గామ్‌లో హిందువుల ఊచకోతకు పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకే వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య స్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడికి భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల తుర్కియేకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక ఇటీవల పాకిస్థాన్ కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయా.. రానున్న…