2025 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బీజేపీ నేతలపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై లేనిపోని విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ భద్రతపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిష్క్రియతను పరోక్షంగా ఎండగట్టారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి 26 మందిని కాల్చి చంపారని, కాశ్మీర్‌లోని పార్క్‌లో ఉగ్రవాదులు హింస సృష్టించేసరికి కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. దేశంలో…
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
India Pakistan: పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచానికి వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.
India Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం పంజాబ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) దాటేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గురువారం బీఎస్ఎఫ్ హతమార్చింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. Read Also: Operation Sindoor Live Updates: పాక్కి వెన్నులో వణుకు…
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 09 ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను క్షిపణులతో భారత్ నాశనం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది భారత్‌పై ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో భారత్ హై అలర్ట్ అయింది. ముఖ్యంగా, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.
Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్…