పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం భారతదేశానికి లేదని.. కానీ మా దేశంపై సైనిక దాడులు జరిపితే.. గట్టి సమాధానం ఇస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని గుర్తు చేసిన ఆయన.. భారత సరిహద్దు దాటిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. అంశంపై పొరుగు దేశం, సన్నిహిత భాగస్వామి అయిన ఇరాన్ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని జైశంకర్ అన్నారు. కాగా.. భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి నిన్న రాత్రి అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన మన దేశంలోనే ఉన్నారు.
READ MORE: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం బడా నిర్మాణ సంస్థల పోటీ..
మరోవైపు.. భారత్-పాక్ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకొన్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన ఓ జూనియర్ మంత్రి హఠాత్తుగా న్యూఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్ మంత్రి అదెల్ అల్‌జుబైర్ నేడు ఢిల్లీకి వచ్చారు. ఆయన మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరిపారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే చర్యల్లో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు.