లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాము చైనాతో సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది. ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారంను ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అందించారు.
ఉపాధి కోసం విదేశీలకు వెళ్లిన భారతీయులు జైలు పాలవుతున్నారు. విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య భారీగా ఉంది. తెలిసో తెలియకో చేసిన తప్పులకు జైళ్లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం విదేశీ జైళ్లలో మొత్తం 8,437 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.