Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Sa India Beat South Africa By 17 Runs In Thriller Virat Kohlis 120 Guides India To 1 0 Lead

IND vs SA: హమ్మయ్యా గెలిచాం.. కానీ భయపెట్టిన దక్షిణాఫ్రికా..!

Published Date :November 30, 2025 , 10:02 pm
By Kothuru Ram Kumar
  • రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం
  • విరాట్ కోహ్లి అద్భుత సెంచరీ (135)తో భారత్ భారీ స్కోరు 349/8
  • రోహిత్ శర్మ (51), కేఎల్ రాహుల్ (56) కీలక ఇన్నింగ్స్‌.
IND vs SA: హమ్మయ్యా గెలిచాం.. కానీ భయపెట్టిన దక్షిణాఫ్రికా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs SA: రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికా పోరాడి భారత్‌ను భయపెట్టింది. కానీ చివరకు టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) త్వరగా అవుటైనా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (57 బంతుల్లో 51) రాణించాడు. అయితే, భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135, 17 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లాసిక్ ఇన్నింగ్స్‌. దీనితో విరాట్ కోహ్లి వన్డేల్లో తన 52వ సెంచరీని నమోదు చేశాడు. మధ్యలో రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమైనా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. చివర్లో రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 349 పరుగుల భారీ స్కోరును అందుకుంది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ఓట్నీల్ బాట్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

Operation Sindoor: పాకిస్తాన్‌కు వార్నింగ్.. “ఆపరేషన్ సిందూర్‌”పై నేవీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 7 పరుగులకే రయాన్ రికెల్టన్ (0), క్వింటన్ డి కాక్ (0), ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్ (11) వికెట్లను కోల్పోయింది. ఒక దశలో 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) కొంతవరకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు మార్కో జాన్సెన్ (70 బంతుల్లో 39, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కార్బిన్ బాష్ (67 బంతుల్లో 51) దూకుడుగా ఆడి టీమిండియా అభిమానుల్లో ఆందోళన కలిగించారు. ఈ ఇద్దరూ కలిసి మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లారు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లతో అద్భుతంగా రాణించగా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 నాలుగు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. చివర్లో అర్షదీప్ సింగ్ 2 రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని పూర్తి చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో తప్ప మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • ind vs sa
  • IND vs SA thriller
  • India vs South Africa 1st ODI
  • india win

తాజావార్తలు

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

  • Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..

  • ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన ‘జైన్ మారియా ఖాన్’

  • Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions