Three sixes by an Indian batter in over in Tests: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి డబుల్ సెంచరీ బాదాడు. 231 బంతుల్లో 200 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో యశస్వి ఏకంగా 12 సిక్స్‌లు కొట్టడం విశేషం. అంతేకాదు జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. దాంతో యశస్వి ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.
జేమ్స్ ఆండర్సన్ వేసిన 85వ ఓవర్‌లోని 2, 3, 4 బంతులకు యశస్వి జైస్వాల్ సిక్స్‌లు బాదాడు. దాంతో టెస్టుల్లో ఓ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. అంతేకాదు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సరసన యశస్వి చేశాడు. 2006లో డేవ్ మొహమ్మద్ బౌలింగ్‌లో, 2007లో మహమ్మద్ రఫీక్ బౌలింగ్‌లో ధోనీ సిక్సులు కొట్టాడు. హార్దిక్ పాండ్యా (2017-మలిందా పుష్పకుమార), రోహిత్ శర్మ (2019-డేన్ పీడ్), ఉమేష్ యాదవ్ (2019-జార్జ్ లిండే) కూడా టెస్టుల్లో ఓ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదారు.
Also Read: IND vs ENG: 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం.. 2024లో మొదటి సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్!
భారత్ తరఫున ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఇంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (535) పేరిట ఉన్న రికార్డును యశస్వి (545) అధిగమించాడు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా యశస్వి నిలిచాడు. యువ ఓపెనర్ 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (855) రెండో స్థానంలో ఉన్నాడు.
JAISWAL SMASHED 3 CONSECUTIVE SIXES AGAINST ANDERSON 🔥🇮🇳pic.twitter.com/HsAoK1XpTt
— Johns. (@CricCrazyJohns) February 18, 2024