BCCI to Announce India Squad For Last 3 Tests against England: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టుని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉండడంతో.. అతడి స్థానంలో రజత్ పాటిదార్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. హైదరాబాద్ మ్యాచ్‌లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాల్లో వైజాగ్‌లో జరిగే టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు జట్టులో అవకాశం వచ్చింది.
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు కూడా భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం (జనవరి 30) సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌ల నుంచి విరామం కోరాడని తెలుస్తోంది. ఒకవేళ విరాట్ ఆఖరి మూడు టెస్టులకు అందుబాటులోకి రాకుంటే.. టీమిండియాకు తిప్పలు తప్పవు. ఎందుకంటే స్వదేశంలో అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలోనే టీమిండియా ఓడిపోయింది.
Also Read: Kerala Court: కేరళ కోర్టు సంచలన తీర్పు.. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (కీపర్), ధృవ్ జురెల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.