Virat Kohli Confirms No Return to Test Cricket: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరలా టెస్టుల్లోకి పునరాగమనం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను భారత్ 0-2తో వైట్‌వాష్ అయిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై వేటు వేయాలని మాజీలు, ఫాన్స్ నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీని మళ్లీ టెస్టుల్లో ఆడించాలని…
టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’ మరలా టెస్ట్ క్రికెట్ ఆడనున్నాడా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీని టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నాలు చేయడనికి సిద్దమైందట. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది మే 12న కింగ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్‌లో జట్టును బ్యాలెన్స్ చేయడానికి…
Kohli- Anushka Breakup Story: నేడు కింగ్ కోహ్లీ పుట్టిన రోజు.. విరాట్ నవంబర్ 5, 1988న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టేస్తున్న విరాట్ కోహ్లీ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..
టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాడు. సుమారు 7 నెలలు తర్వాత బరిలోకి దిగడంతో ఫ్యాన్స్ అందరు కింగ్ ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకున్న కొన్ని గంటల్లోనే కోహ్లీ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ చేసిన ఒక మెసేజ్ తన వన్డే భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీసింది.…
‘పరుగుల రారాజు’ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బాదిన విరాట్.. ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు పడుతున్నాడు. ఎప్పుడో ఓసారి మెరుపులు తప్పితే.. మునుపటి కోహ్లీ మనకు కనబడుట లేదు. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న కింగ్.. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోతున్నాడు. ఎంతలా అంటే టాప్-20 నుంచి కూడా ఔట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ…
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గొప్ప నటుడు అని, అయితే సినిమాల్లోకి మాత్రం రావొద్దని కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముఖేష్ ఛబ్రా అంటున్నారు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం క్రీడారంగంలోనే కొనసాగాలని, రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం మాత్రం అస్సలు చేయొద్దని సూచించారు. విరాట్ ఎన్నో యాడ్స్ చేశాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా పలు టీవీ యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. Also Read:…
ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అన్ని ఫార్మాట్లలో నిలకడ, దూకుడు శైలి, నాయకత్వ లక్షణాలు క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాయి. ఆట పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, అంకితభావం అతన్ని క్రికెట్‌లో అత్యంత ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్.. ఒకానొక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. ఆపై తిరిగి పుంజుకున్నాడు. అందుకే విజయాలను మాత్రమే కాకుండా.. క్లిష్ట…
Virat Kohli Heap Praise on Jasprit Bumrah in T20 World Cup 2024 Performance: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజేతగా నిలవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. వికెట్స్ అవసరం అయినప్పుడు ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా.. అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.…
Virat Kohli Retirement: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ అనంతరం విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను…
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన…