తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్‌కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
Cyber Crime: 9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త.. వివరాలు ఇలా..
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కెపాసిటీకి మించి మనుషులను ఎక్కించుకోవడంతో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషాద గతానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Paruvu: దొరికిపోలి లేదా పారిపోవాలి.. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ‘పరువు’.. ట్రైలర్ రిలీజ్..