తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్‌కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. Cyber Crime: 9 కోట్లు…
పాకిస్థాన్ దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ (శుక్రవారం) వాయువ్య పాకిస్తాన్‌లోని కొండ ప్రాంతం నుంచి ప్రయాణీకులతో కూడిన బస్సు లోయలో జారిపడటంతో దాదాపు 20 మంది వరకు మరణించారు.