2017లో విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ‘ఐ యాం నాట్ ఎ రోబోట్’.. కొరియన్ భాషలో ఓటీటీ ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్న ఈస్ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులోకి రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలోకి ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ తేదీని తాజాగా ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ వెబ్సైట్ కి సంబంధించిన కొత్త పోస్టులను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇకపోతే ఈ పోస్టులో ఆర్సిబి జట్టుపై సెటైర్స్ వేస్తూ రిలీజ్ డేట్ ను తెలిపారు.
Also read: IPL History: ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతోపాటు సెంచరీ చేసిన ఆల్రౌండర్స్ వీళ్లే..
ఈ కొరియన్ సిరీస్ ఐఎండిబి లో 8 రేటింగ్ పొందడంతో పాటు.. కొరియాలో అత్యధికమంది వీక్షించిన వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సీజన్ మొత్తం 32 ఎపిసోడ్స్ తో కొనసాగుతోంది. సీజన్ 2 కూడా రాబోతున్నట్లు డైరెక్టర్ జంగ్ డే యూన్ తెలిపారు. ఇకపోతే మొదటి సీజన్లో రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉండటంతో.. సెకండ్ సీజన్ లో మాత్రం యాక్షన్ తో పాటు బోల్డ్ కంటెంట్ ను కూడా జోడించనున్నట్లు ఆయన తెలిపారు.
Also read:Rathnam : సెన్సార్ పూర్తి చేసుకున్న విశాల్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?
ఇక సీరియస్ కథ విషయానికొస్తే రోబోతో ప్రేమలో పడతాడు ఓ బిలినియర్. ఇక ఈ సిరీస్ లో యు సీయుంగ్ హో, చే సూ బీన్ లు కీలక పాత్ర పోషించగా.. జంగ్ డే యూన్ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. చుడాలిమరి కొరియన్ డ్రమ్స్ ను ఇష్టపడే భారతీయులు ఈ వెబ్ సిరీస్ ను ఎలా ఆదరిస్తారో.