టి20 ప్రపంచ క్రికెట్లో మ్యాచ్ చివరి బాల్ వరకు కూడా విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పడానికి చాలా కష్టం. చివరి రెండు ఓవర్ల వరకు మ్యాచ్ ఒక జట్టువైపు ఉంటే.. అదే ఆట ముగిసే సమయానికి ఫలితం వేరే టీం వైపు కూడా మారిపోవచ్చు. అంతలా టి20 ఫీవర్ క్రికెట్ లవర్స్ కు పట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఐపిఎల్ 17 సీజన్స్ లో ఇంతవరకు ఒక సెంచరీ తో పాటు ఒక హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్న వారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దామా..
Also Read: Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100వ వ సారి రక్తదానం చేసిన నటుడు..
ముందుగా ఈ లిస్టులో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు చెప్పుకోవచ్చు. తన ఆసాధారమైన బ్యాటింగ్ తో ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించిన రోహిత్ శర్మ బ్యాటింగ్లో పరుగుల వరదను సృష్టిస్తాడు. ముంబై ఇండియన్స్ కు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఘనతను దక్కించుకున్నాడు. కాకపోతే రోహిత్ శర్మ బ్యాటింగ్ తో కాకుండా బౌలింగ్ తో కూడా మ్యాచ్ లను తిప్పేశాడు. ఐపీఎల్ 2009 సీజన్ లో రోహిత్ శర్మ డెక్కన్ చార్జెస్ తరఫున ముంబై ఇండియన్స్ పై హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో రెండు సెంచరీలు సాధించి హ్యాట్రిక్ తీసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ లిస్టులో షేన్ వాట్సన్ కూడా ఉన్నారు. 2014లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పై అతడు హ్యాట్రిక్ వికెట్స్ ను సాధించాడు. ఆ తర్వాత చెన్నై జట్టులోకి వచ్చిన షేన్ వాట్సన్ సెంచరీ సాధించి ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు.
Also Read:T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024.. దినేష్, పరాగ్‌కు నిరాశే! భారత జట్టు ఇదే
ఇక ఈ లిస్టులో మరో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్. ఎప్పుడు నుంచో కోల్కత్తా నైట్ రైడర్స్ టీంలో కొనసాగుతున్నారు. ఈ సీజన్ లో తాజాగా అతడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఇదే అతనికి మొదటి ఐపీఎల్ సెంచరీ కాగా.. 2013లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో అతడు హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. ఇలా ఈ ముగ్గురు క్రికెటర్లు ఐపీఎల్ లో సెంచరీ తోపాటు హ్యాట్రిక్ తీసిన క్రికెటర్స్ జాబితాలో ఉన్నారు.