ఈమధ్యకాలంలో వివాహేతర సంబంధాలు, ప్రియుడి కోసం భర్తని హతమార్చడం, ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా విశాఖలో జరిగిన సాయిప్రియ ఉదంతం కలకలం రేపింది. ఓ వివాహిత సముద్రంలో గల్లంతయినట్టు వచ్చిన వార్తలతో ఏకంగా కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగింది. గాలింపు సాగుతుండగానే అసలు సంగతి వెలుగు చూసింది. భర్తతో కలిసి బీచ్ కి వచ్చిన సాయిప్రియ అక్కడినించి మిస్ అయింది. ఆమె సముద్రంలో కనిపించకుండా పోయిందేమోనని అంతా హైరానా పడ్డారు. హెలికాప్టర్ల ద్వారా కూడా సెర్చ్ చేశారు. అసలు ఆమె సముద్రంలో మిస్ కాలేదని, తన ప్రియుడితో కలిసి నెల్లూరు.. అక్కడినించి బెంగళూరు వెళ్ళిపోయిందని తర్వాత తెలిసింది. సాయిప్రియ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడింది. ఆమెతో ప్రియుడితో కలిసి వెళ్ళిందని, ఆమె కోసం గాలించారు.
అయితే సాయిప్రియ తన తండ్రికి వాట్సాప్ మెసేజ్ చేసింది. మీరంతా నన్ను వెతకవద్దని, నాన్నా.. నన్ను వెతకొద్దు.. నాకోసం వెతికితే చచ్చిపోతానని బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టింది. తాను బెంగళూరులో ప్రియుడితో క్షేమంగా ఉన్నానని చెప్పింది.. బెంగళూరులో ప్రియుడితో పెళ్లి కూడా జరిగిపోయిందని మెడలో తాళిబొట్టుతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. చావైనా, ఏదైనా అతనితోనే అంటూ భారీ డైలాగులు చెప్పింది.
ప్రియుడి కోసం భర్తను చంపేపిన ఘటనలు కలకలం రేపుతున్న వేళ కొంతమంది వివాహిత మహిళలు, పురుషుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కామాతురాణం నభయం.. నలజ్జ అంటారు. కామంతో వున్నవారికి భయం. సిగ్గు వుండవని అర్థం. తాము వెళ్లే దారి మంచిదని, తమ సుఖం ముఖ్యం అనీ, పిల్లలు, భర్త/భార్య ఏమైపోయినా ఫర్వాలేదనే ధోరణి వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.