Stock Market: దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు (జూన్ 9న) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అంచనాలకు మించి అరశాతం మేర కీలక రేట్లను తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తి (CRR)లో కోత విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న నిర్ణయాలతో షేర్ మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 280 పాయింట్లు పుంజుకొని 82,469 దగ్గర ట్రేడింగ్ అవుతున్నాయి. ఇక, నిఫ్టీ 88 పాయింట్లు పైకి ఎగిసి 25,091 వద్ద కొనసాగుతోంది.
Read Also: US: లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసులు-ఆందోళనకారుల మధ్య ఘర్షణ
అయితే, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.60 పైసలుగా ఉంది. నిఫ్టీ సూచీలో కోటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, టాటా మోటార్స్, యాక్సిక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించగా.. భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎటర్నల్, హెడ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో రోజును స్టార్ట్ చేశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయి.