నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నల్గొండకు వెళ్లారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు, లక్షణంగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లను జగన్మోహన్ రెడ్డికి వదిలేశారు..
Also Read : LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
నల్గొండ జిల్లాకు రూ. 1000 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. 2014లో ఒకసారి కేసీఆర్ మాటలకు మోసపోయాం.. 2018లో రైతుబంధు పథకం తీసుకొచ్చి రెండోసారి కేసీఆర్ మోసం చేశారు.. ఇక మూడోసారి మోసపోవద్దు అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Also Read : Telangana Secretariat: ఇంద్రభవనంలా మెరిసిపోతున్న సెక్రటేరియట్
దళిత బంధు నగదు బదిలీలో అవినీతికి పాల్పడిన చిట్టా మీ దగ్గర ఉంటే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తినడానికి తిండి లేని మంత్రి జగదీశ్ రెడ్డికి 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు. సీనియర్ నాయకుడైన నేను, మా ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పటికి అద్దె ఇళ్లలోనే ఉంటున్నామ్ అని ప్రశ్నించారు.
Also Read : Nandamuri Balakrishna: ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచం మొత్తం వెతికినా దొరకడు
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన నకిరేకల్ ఎమ్మెల్యే సైతం అక్రమ ఆస్తులు సంపాదించాడు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నోటిఫికేషన్లో ఇచ్చినట్లు కనిపించడం లేదు.. కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో బెంచీలు.. గర్ల్స్ జూనియర్ కళాశాలలో టాయిలెట్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగాబాద్ కు కాదు కేసీఆర్ వెళ్లాల్సింది.. ఛత్తీస్ ఘడ్ కు వెళ్ళి అక్కడి ప్రభుత్వం రైతులకు ఏ విధంగా మేలు చేస్తుందో చూడు అని అన్నారు.
Also Read : Uttam Kumar Reddy : రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది
జిల్లా అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినా ఎంపీలుగా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిధుల మంజూరుకు కేంద్రంతో కొట్లాడుతున్నాం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాను ఎదిరించి తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకుంటే మళ్లీ మేమందరం రోడ్లమీదకి వచ్చేలా కేసీఆర్ చేశాడు.. రేవంత్ రాకతో నాది తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసినట్లు అనిపిస్తోంది.. పీసీసీ చీఫ్ బీ ఫాం ఇస్తారు కానీ.. వారి సమక్షంలో నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్న.. నల్గొండ నుంచి పోటీ చేస్తా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు.