Champions Trophy 2025: ఐసీసీ కోర్టులో బంతి.. నేడు తేలనున్న ఛాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం!
- ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం
- ఐసీసీ కోర్టులో బంతి
- మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోన్న ఐసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో.. టోర్నీ షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. పాకిస్థాన్‌లోనే పూర్తి టోర్నీ జరగాలని పట్టుపడుతోంది. ఐసీసీ చర్చలు జరిపినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఇందుకు బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం ప్రస్తుతం ఐసీసీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హైబ్రిడ్ మోడల్లో మెజారిటీ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహించి.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించాలని ఐసీసీ బావిస్తోంది. ఇందుకు పీసీబీ ఒప్పుకోకుంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని పాకిస్థాన్ వెలుపల నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. టోర్నీని పాక్ నుంచి తరలించినా.. ఆతిథ్య హక్కులు మాత్రం పీసీబీ వద్దే ఉంటాయి. భారత్ లేకుండా పాక్‌లోనే టోర్నీ నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. ఐసీసీ ఇప్పుడు ఈ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
Also Read
Also Read: WPL 2025: డిసెంబర్ 15న ఐపీఎల్ వేలం.. వేదిక ఎక్కడంటే?
భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే ఆర్థికంగా భారీ నష్టం కలుగుతుంది కాబట్టి.. ఐసీసీ మూడో ప్రత్యామ్నాయంను పరిశీలించడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మొదటి ప్రత్యామ్నాయానికి భారత్, ఐసీసీ మొగ్గు చూపుతుండగా.. పాకిస్తాన్ మాత్రం ససేమిరా అంటోంది. ఇక రెండో ప్రత్యామ్నాయాన్ని ఐసీసీ పరిశీలిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలించాలని ఐసీసీ చూస్తోంది. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో రాజకీయ ఆందోళనలు జరుగుతుండటం కూడా మరో కారణం. నేడు వర్చువల్‌గా జరిగే సమావేశంలో టోర్నీ షెడ్యూల్‌పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!