Hyundai Creta : హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఇంకా రోడ్లపై పరిగెత్తనే లేదు. కానీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జనవరి 2025లో 1589.47 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధి నెలవారీ ప్రాతిపదికన జరుగుతుండగా, వార్షిక ప్రాతిపదికన కూడా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 88.82 శాతం పెరిగాయి. గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తన ప్రసిద్ధ SUV క్రెటా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ దీనిని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.99 లక్షలుగా పేర్కొంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు.
Read Also: KCR: ఒర్లకండిరా బాబు.. దండం పెడతా.. కార్యకర్తలపై కేసీఆర్ అసహనం
హ్యుందాయ్ ఇండియా జనవరి 2025లో 321 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. అయితే డిసెంబర్ 2024లో దాని ఎలక్ట్రిక్ కార్లలో కేవలం 19 మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ విధంగా నెలవారీ ప్రాతిపదికన దాని అమ్మకాలు 1589.47 శాతంగా ఉన్నాయి. గత సంవత్సరం జనవరి 2024లో కంపెనీ మొత్తం 170 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా కంపెనీ ఈవీ అమ్మకాల వృద్ధి వార్షిక ప్రాతిపదికన 88.82 శాతంగా ఉంది. జనవరి 2025లో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 32.28 శాతం పెరిగాయి. గత ఏడాది జనవరిలో దేశంలో 8,517 కార్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జనవరిలో మొత్తం 11,266 కార్లు అమ్ముడయ్యాయి. ఇది మాత్రమే కాదు.. అతిపెద్ద లైనప్‌తో టాటా మోటార్స్ దేశంలో నంబర్-1 ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా నిలిచింది.
Read Also:Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ హయాంలో పుట్టిన “సాంబార్”.. అసలు కథ ఇదే!
జనవరి 2025లో టాటా మోటార్స్ మొత్తం 5,047 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించగా డిసెంబర్ 2024లో ఈ సంఖ్య 4,047 యూనిట్లుగా ఉంది. ఈ విధంగా నెలవారీ ప్రాతిపదికన కంపెనీ అమ్మకాల వృద్ధి 24.71 శాతంగా ఉంది. ఇది కాకుండా, జనవరి 2025లో దేశంలో 4,237 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలతో ఎంజీ మోటార్ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది.. 688 కార్ల అమ్మకాలతో మహీంద్రా & మహీంద్రా మూడవ స్థానంలో నిలిచింది. భారతదేశం ఎలక్ట్రిక్ కార్లకు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. టెస్లా లాంటి కంపెనీ భారతదేశానికి కూడా వస్తుందని ఇప్పుడు కన్ ఫాం అయింది. అయితే దాని ప్రత్యర్థి కంపెనీ BYD ఇప్పటికే భారత మార్కెట్లో ఉంది.