జబర్దస్త్ తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. ఒక సాధారణ కంటెస్టెంట్ గా వచ్చిన ఆయన అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా మారి బుల్లితెరపై ఉన్న కామెడీ షో లకు రారాజుగా మారాడు. ఒకవైపు బుల్లితెరపై అనేక షో స్ లలో నటిస్తూనే మరోపక్క వెండితెర పై సినిమాలలో కూడ నటిస్తూ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇక టీవీ, సినిమాలు విషయం పక్కన పెడితే ప్రస్తుతం హైపర్ ఆది పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెనర్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కారణం హైపర్ ఆది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే కాకుండా బయట మంచి వ్యక్తిలా కూడా హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టం
Also read: Gujarat: బౌద్ధం వేరే మతం, హిందువులు మతం మారాలంటే అనుమతి తప్పనిసరి..
ఇక ఈ ఇష్టంతోనే తాజాగా హైపర్ ఆది జనసేనకు సపోర్టుగా నిలబడబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పోటీచేసే ప్రాంతాలలో అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెబుతున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గరవుతున్న కారణంగా రాజకీయ పార్టీలు ఎవరి ప్లాన్స్ వారు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా పార్టీలో స్టార్ క్యాంపెనర్స్ ను రంగంలోకి దింపుతున్నాయి. అందులో భాగంగానే జనసేన సపోర్టర్ గా హైపర్ ఆది ప్రచారానికి సిద్ధమయ్యాడు.
ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురం నుండి ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైపర్ ఆది మీడియాతో మాట్లాడుతూ.. ఇక వచ్చేనెల ఎలక్షన్స్ పూర్తయ్యేంతవరకు తాను షూటింగ్స్ ఏమి చేయడం లేదని అప్పటివరకు అవసరమయ్యే షూటింగ్స్ అన్ని ఇప్పటికే కంప్లీట్ చేశానని చెప్పుకొచ్చాడు. రాబోయే నెల కాలం కేవలం పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ప్రచారం చేస్తానని అలాగే ఆయన నిలబెట్టిన 21 నియోజకవర్గాల వద్దకు వెళ్లి వారికి సపోర్ట్ అందిస్తానని చెప్పుకొచ్చాడు. ఎన్నికలు తర్వాతనే తాను మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటానని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనేక సినిమాలను హోల్డ్ లో పెట్టి ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నాడు. చూడాలి మరి ఈసారి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుందో.