గెలుపే లక్ష్యంగా చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేష్ త్వరలోనే రానుంది. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి మరోసారి రంజిత్ రెడ్డి గెలిచేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ రోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం తాండూరు పట్టణంలోని చెన్గెస్ పూర్ రోడ్ సమీపంలో నిర్వహిస్తున్న రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి. ఆయనతో పాటు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, సోదరులతో ఈ వేడుకల్లో పాల్గొని అక్కడ హాజరైన వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
చేవెళ్ళలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కలియతిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు రంజిత్ రెడ్డి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ ముందుండే రంజిత్ రెడ్డికే ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన రంజిత్ రెడ్డి వెంట యువత నడుస్తున్నారు. నియోజకవర్గం ప్రజల్లోనూ ఎంపీ రంజిత్ రెడ్డినే గెలిపించుకోవాలని కోరిక బలంగా కనిపిస్తోంది. రంజిత్ రెడ్డి చేసిన సేవలే ఆయన్ను మళ్లీ గెలిపిస్తాయని స్థానికులు అంటున్నారు. ఎక్కడ సమస్య వచ్చిన ముందుండి పరిష్కరించే తత్వం ఉండటంతో ఎంపీ రంజిత్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారనేది గ్రౌండ్ రిపోర్ట్.