జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వనకు పుట్టిస్తున్నారు రెవెన్యూ, హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎకరాల కొలది భూములను చెరపట్టారు. భూకబ్జాదారుల నుంచి భూములను విముక్తి కల్పించడానికి కాప్రా రెవెన్యూ అధికారులు దూకుడు మొదలుపెట్టారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడులకు ఐదు ఎకరాల భూమిపై నోటీసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు. డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ కబ్జా చేసిన భూమిని అధికారులు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. మాజీ మేయర్ మేకల కావ్య ఫామ్ హౌస్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడితే అక్కడ భూకబ్జాలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది.
Lebanon: లెబనాన్‌లో మళ్లీ ప్రకంపనలు.. ఒక్కసారిగా పేలిన వాకీటాకీలు, మొబైల్స్
ఎకరాల కొలది భూములను రెవెన్యూ అధికారులు గుర్తించి ఇప్పటివరకు 500 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నట్టు కాప్రాసిల్దార్ సుచరిత వెల్లడించారు. ఒకవైపు జవహర్ నగర్ ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం తామ భూకబ్జాలకు చేసిన భూములను పరిరక్షించుకోవడం వంటి దినచర్యగా మారింది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు అధికారులు జవహర్ నగర్ లో దూకుడు పెంచారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకై నడుం బిగించారు భావితరాలపై చెరువులను రక్షించడానికి ప్రభుత్వ భూములను రక్షించడానికి ఏమి చేయాలో ప్రజాప్రతినిధులకు పాలుపోవడం లేదు.
Bhadradri : భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి అమెరికాలో విరాళాలు