Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మృతులను భువనేశ్వరి (17), సంధ్య (10)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటి సమీపంలోని ఓ దుకాణం నుంచి మామిడి పండ్లు కొనుగోలు చేసి ఇద్దరు తిన్నారు. అనంతరం మరుసటి రోజు నుంచి వారికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ రెండు రోజుల వ్యవధిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అదే రోజు, అదే దుకాణం నుంచి మరో ఆరుగురు సైతం మామిడి పండ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ పండ్ల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశం ఉంది. ఆ ఆరుగురు ఆరోగ్య పరిస్థితిపై కూడా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, ఆరోగ్య శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!