ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని అమౌలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 44 ఏళ్ల వ్యక్తి రాజు పాల్ వివాహం అయిన ఆరు రోజుల తర్వాత తన భార్యను కొట్టి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.…