మీరు రూ. 25,000 బడ్జెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇది అమెజాన్‌లో రూ.18,650 భారీ తగ్గింపుతో లిస్ట్ అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ కలర్-అక్యూరేట్ డిస్ప్లే, అద్భుతమైన పనితీరు, వేగవంతమైన 125W ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోటరోలా హ్యాండ్ సెట్ 12GB + 256GB వేరియంట్‌లో వస్తుంది. దీని అసలు ధర రూ.41,999, కానీ ప్రస్తుతం మీరు దీన్ని అమెజాన్‌లో కేవలం రూ.23,349కి పొందవచ్చు. ఈ ఫోన్ పై 44 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
Also Read:IPL 2026 Auction: అబుదాబిలో ఐపీఎల్ 2026 వేలం.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?
అంటే ఈ హ్యాండ్ సెట్ పై రూ.18,650 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్స్ పై అదనంగా రూ.1,500 తగ్గింపు, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూజ1,000 వరకు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్‌లన్నింటితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత హ్యాండ్‌సెట్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా అదనపు డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Also Read:Varanasi : ‘వారణాసి’లోకి పవర్‌ఫుల్ యాక్టర్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లలో 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ HDR10+ కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.