టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్, రాజమౌళి ఇద్దరు గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు అదిరిపోయే స్పందన రాగా. ఈ భారీ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన అభిమానులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రంకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Also Read : Urvashi : తిండీ నిద్ర మానేసి రాత్రంతా అదే పని.. నా ఆరోగ్యం నాశనం చేసుకున్నా
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలక్షణ నటుడు జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తనదైన మ్యానరిజం, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగల ప్రకాష్ రాజ్ కోసం రాజమౌళి ఎలాంటి రోల్ రాశాడా అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఈ వార్తపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్ నిజంగానే నటిస్తున్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.