ఐపీఎల్ 2023 ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది. రేపు ( మే 28 ) అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను IPL తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ ముగింపు వేడుకలో రాపర్ కింగ్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ న్యూక్లియా ప్రదర్శన ఇవ్వనున్నారు. అదే సమయంలో, రాపర్ డివైన్, గాయని జోనితా గాంధీ కూడా కలర్‌ఫుల్ ఈ కార్యక్రమంలో పాల్గనున్నారు.
Also Read : Chandrababu: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సైకిల్ రెడీ.. జరిగేది కురుక్షేత్రం.. అజాగ్రత్త వద్దు..
అంతకుముందు గాయకుడు అరిజిత్ సింగ్, ఎ.పీ. ధిల్లాన్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. దీంతో పాటు, తమన్నా, రష్మిక మందన్న కూడా తమ డ్యాన్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ ఉత్కంఠభరితమైన పోరు ప్రారంభానికి ముందు బీసీసీఐ, IPL 2023 ముగింపు వేడుకను భారీగా ప్లాన్ చేస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షకులు చూడొచ్చు.. అలాగే డిజిటిల్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని జియో సినిమాలో చూడవచ్చు.
Also Read : Kate Sharma : అందాలేమో భారీగున్నాయి.. బట్టలేమో బడ్జెట్లో ఉన్నాయి
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రేపు ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ వేయబడుతుంది. ఇక సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్-16వ సీజన్ ప్రారంభ వేడుకల్లో అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, రష్మిక మందనా ప్రేక్షకులను అలరించారు. ప్రారంభ వేడుకలను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు కోటీ మంది హాజరయ్యారు. టీవీలు, ఫోన్లలోనూ ఈ వేడుకలను కోట్లాది మంది వీక్షించారు. ఐపీఎల్ ముగింపు వేడుకలకు ఇంతకంటే ఎక్కువగా ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలను బీసీసీఐ రప్పిస్తోంది.