Duplicate Medicines: కోట్ల విలువైన నకిలీ మందులు సీజ్..
- ముంబై నగరంలో ఆయుర్వేదం పేరుతో భారీగా నకిలీ మందులను తయారు.
- ఘర్వార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పై తాజాగా ఎఫ్‌డిఎ దాడులు చేసింది.
- దాడిలో ఎఫ్‌డీఏ ఏకంగా రూ.1 కోటి 27 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duplicate Medicines Making: ముంబై నగరంలో ఆయుర్వేదం పేరుతో భారీగా నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పై తాజాగా ఎఫ్‌డిఎ దాడులు చేసింది. ఈ దాడిలో ఎఫ్‌డీఏ ఏకంగా రూ.1 కోటి 27 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. దాదాపు రూ.2 కోట్ల 93 లక్షల విలువ కలిగిన 255 మందుల తయారీ యంత్రాలను కూడా సీజ్ చేశారు. స్ట్రీట్ నంబర్ 20, శైలేష్ ఇండస్ట్రీ, గీతా గోవింద్ ఇండస్ట్రీ, నవ్‌ఘర్, వసాయ్ లో ఈ దాడి జరిగింది. ఈ కంపెనీ గడిచిన 7 సంవత్సరాలుగా నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీ ఘర్వార్ ఫార్మా ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రుసాబ్ ఫార్మా పేరుతో రిజిస్టర్ చేసి ఉంది. దీని లైసెన్స్ పంచకుల నుండి వచ్చింది. కాకపోతే ఔషధం తయారీ మాత్రం వసాయ్ లో ప్రారంభమైంది.
Fact Check: ఆ రెవెన్యూ రికార్డు నకిలీది.. ఏపీ ప్రభుత్వం
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
జాయింట్ కమిషనర్ ఎఫ్‌డిఎ విజిలెన్స్ డాక్టర్ రాహుల్ ఖాడే తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్‌డిఎ దాడులు నిర్వహించి రూ.1 కోటి 27 విలువైన వస్తువులు, కోట్ల విలువ చేసే యంత్రాలను స్వాధీనం చేసుకుంది. ఎఫ్‌డీఏ అధికారులు దాడులు నిర్వహించగా హర్యానాలోని పంచకులలో ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు కంపెనీకి లైసెన్స్ ఉన్నట్లు తేలింది. నకిలీ మందులను తయారు చేస్తున్న కంపెనీ డైరెక్టర్, భాగస్వామి అయిన ధీరేంద్ర జనార్దన్ పై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌డిఎ నుండి సూచనలు వచ్చాయి. ఘటనా స్థలం నుంచి నకిలీ ఉత్పత్తుల తయారీకి ఉంచిన ముడిసరుకును ఎఫ్‌డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Vegetable Prices: పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం
ఎఫ్‌డీఏ విజిలెన్స్ అధికారి వీఆర్ రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కంపెనీ నకిలీ మందులను విక్రయిస్తోందని.. శాఖాపరమైన సమాచారం మేరకు విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఇటీవల కూడా, వాసాయిలో నకిలీ సౌందర్య సాధనాల తయారీ కంపెనీపై FDA దాడి చేసింది. ఇక్కడ లోరియల్ కంపెనీకి చెందిన నకిలీ ఉత్పత్తిని తయారు చేసి అమ్మేస్తున్నారు. నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ కంపెనీ పలు నకిలీ ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతున్నట్లు శుక్రవారం నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!