Lays Potato Chips: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్‌లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 13న ప్రకటించిన ఈ రీకాల్ కాస్త జనవరి 27న FDA అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచబడింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉండటం. ఈ మిశ్రమం వల్ల కొంతమంది ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని…
Duplicate Medicines Making: ముంబై నగరంలో ఆయుర్వేదం పేరుతో భారీగా నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పై తాజాగా ఎఫ్‌డిఎ దాడులు చేసింది. ఈ దాడిలో ఎఫ్‌డీఏ ఏకంగా రూ.1 కోటి 27 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. దాదాపు రూ.2 కోట్ల 93 లక్షల విలువ కలిగిన 255 మందుల తయారీ యంత్రాలను కూడా సీజ్ చేశారు. స్ట్రీట్ నంబర్ 20, శైలేష్ ఇండస్ట్రీ, గీతా…
Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్‌ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్‌డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.
MRI Machine: అమెరికాలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. జూన్ నెలలో ఒక మహిళ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజినింగ్) మెషీన్‌లోకి లోడ్ చేసిన తుపాకీతో వెళ్లింది. ఈ పరిణామం ఆమె ప్రాణాలను మీదికి తెచ్చింది. లోడ్ చేయబడిన తుపాకీ పేలడంతో ఆమె వెనక భాగంలో గాయమైంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం..57 ఏళ్ల మహిళ ఈ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది.
Indian Firm Suspends Production Of Eye Drops Linked To Death In US: భారతదేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించారు. పలువురికి కంటి చూపు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎజ్రీకేర్ వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 55 మంది వరకు దీని వల్ల ప్రభావితం అయ్యారు.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.
చైనాలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో దాడి చేస్తూనే ఉంది.. అయితే, మహమ్మారి కట్టడికి అనేక పరిశోధనల తర్వాత.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది… ఆ తర్వాత భారత్‌లో ఒక ఫౌడర్ కూడా అందుబాటులోకి తెచ్చారు.. ఇప్పుడు మహమ్మారి చికిత్సలో టాబ్లెట్ కూడా చేరింది… అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రకు అనుమతి ఇచ్చింది.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఇవాళ తొలి కోవిడ్…
కరోనాపై విజయం సాధించాలంటే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. కొన్ని వ్యాక్సిన్లు సింగిల్ డోసు అయితే.. మెజార్టీ వ్యాక్సిన్లు మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్.. ఇలా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంది.. అయితే, రెండు రోజులు వేయించుకున్నా.. కరోనా రాదనే గ్యారంటీ మాత్రం లేదు.. కానీ, ఆస్పత్రిలో చేరే పరిస్థితిని తగ్గిస్తుంది.. ఇక, రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌పై కూడా ప్రయోగాలు సాగుతున్నాయి.. ఈ…
కరోనాకు చెక్ పెట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీనిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు కూడా రావడంతో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందిస్తున్నారు.…