Join My Wedding: పైన హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా. పెళ్లి చేసుకొని కోట్లు సంపాదించడమేంటి అనుకుంటున్నారా. పెళ్లంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. నగలు నట్రా, విందులు వినోదాల కోసం ఎవరి తాహత్తు మేరకు వాళ్లు ఖర్చు చేస్తూనే ఉంటారు. మరి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అని ఆలోచిస్తున్నారా… ఇంట్లో పెళ్లి ప్రస్తావన రాగానే గెస్ట్ లిస్ట్, ఖర్చుల గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన మొదలవుతుంది. కుటుంబ సభ్యులు ముందుగా ఖర్చులను అంచనా వేయడం ప్రారంభిస్తారు. పెళ్లి అనేది ఏ కుటుంబంలోనైనా జరిగే అతి పెద్ద పండుగే కాబట్టి ఖర్చు సాధారణమే. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని గ్రాండ్‌గా చేయాలని కోరుకుంటారు. ఈ సంవత్సరం కూడా మీ ఇంట్లో పెళ్లి జరగాలంటే ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు పెళ్లి నుంచి భారీగా సంపాదించవచ్చు. మీ పెళ్లికి పెట్టిన ఖర్చులు కూడా వచ్చేస్తాయి. ఏంటి ఇది చదవగానే త్వరగా చెప్పేయండి.. అని అనుకుంటున్నారు కదా.. ఎలాగో తెలుసుకుందాం…
Read Also:Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు
పెళ్లిలో డబ్బు సంపాదించడానికి మీరు కొంతమంది విదేశీ అపరిచితులను ఆహ్వానించాలి. ఇది ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. కానీ రాబోయే అతిథులు మాత్రం కచ్చితంగా విదేశీయులే అయి ఉండాలి. అనేక దేశాల పౌరులు భారతీయ వివాహాలకు హాజరు కావడానికి ఇష్టపడతారు. దీని కోసం వారు మీకు డబ్బు కూడా ఇస్తారు. మీరు కూడా మీ పెళ్లికి విదేశీయులను ఆహ్వానించాలనుకుంటే.. మీరు ‘Join My Wedding’కి వెళ్లి ఈ పనిని సులభంగా చేయవచ్చు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం https://www.joinmywedding.comలో అందుబాటులో ఉంది. ఇక్కడ లాగిన్ చేయడం ద్వారా మీరు మీ వివాహ ఆహ్వానాన్ని విదేశీయులకు ఇవ్వవచ్చు.
Read Also:Special Offer Passengers: అయ్.. ఒక్క రూపాయికే హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణం.. కానీ..!
ఆన్‌లైన్ పోర్టల్ వివిధ దేశాల నుండి భారతదేశానికి వెళ్లే పర్యాటకులు వారు హాజరుకాగల వివాహాన్ని కనుగొనడానికి అనుమతిస్తుంది. ఏదైనా వివాహానికి హాజరు కావడానికి విదేశీయులు కొంత డబ్బు చెల్లించాలి. ఈ డబ్బు వారి ఆదాయ వనరుగా మారుతుంది. joinmywedding వెబ్‌సైట్‌లో రాబోయే నెలల్లో జరగబోయే వివాహాల గురించిన సమాచారం ఉంది. ఎవరైనా విదేశీ పౌరులు ఇక్కడకు వెళ్లి ఏదైనా వివాహంలో పాల్గొనవచ్చు.