Special Offer Passengers: ఒక్కరూపాయికి ఏమొస్తుంది.. ఏమీ రాదు. అసలు రూపాయికి విలువ ఉంటుందా? రూపాయి రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు వేలు, లక్షలు, కోట్లల్లో బతుకుతున్నా కాలంలో మనం జీవిస్తున్నాం. ఏదైనా కొనాలన్నా.. తినాలన్నా చేతిలో వెయి పక్కా ఉండాల్సిందే. బయటకు వెళితే 10 వేలైనా 10 రూపాయితో సమానమే. ఒక్కప్పుడు దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలో ఒక్కరూపాయికే కిలో బియ్యం అని వినే వుంటాం. అప్పట్లో రూపాయి విలువ ఉండేదేమో కానీ.. మారుతున్న కాలానికి రూపాయి అనే విలువలు ఎప్పుడు పోయాయి. ఇప్పుడు అడుక్కుని తినే వాడికి కూడా రూపాయి ధర్మం వేస్తే పైనుంచి కింది వరకు చూసే రోజులు వచ్చాయి. అలాంటిది రూపాయి ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది. తింక్ బిక్ అబ్బా.. అస్సలు తింక్ చేయలేరు. అది కలలో కూడా ఊహించని హఠాత్ పరిణామాలు అని చెప్పుకోవచ్చు. కానీ.. ఇది నిజమే.. రూపాయికే మందు, రూపాయికే కిలో బియ్యం.. రూపాయికే ప్రయాణం. వినడానికి బాగానే ఉన్న ఈ మాటల్లో చివరి మాట నిజం కాబోతోంది. న్యూగో ట్రాన్స్‌పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ కేవలం ఒక్క రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది.
Read also: Telangana Rains: తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఆగస్టు 15 తర్వాత వర్షాలకు ఛాన్స్..!
ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ కంపెనీ న్యూ గో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్‌పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా ప్రకటించారు. అలాగే ఇండోర్ – భోపాల్, ఢిల్లీ – చండీగఢ్, ఢిల్లీ – ఆగ్రా, ఢిల్లీ – జైపూర్, ఆగ్రా – జైపూర్, బెంగుళూరు – తిరుపతి, చెన్నై – తిరుపతి, చెన్నై – పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో తమ సేవలను కొనసాగిస్తారని, అయితే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ సుస్థిరత కోసం ప్రజలను ప్రోత్సహించడానికి మరియు ఎలక్ట్రిక్ బస్సులలో కూడా సుదూర ప్రయాణాలు చేయవచ్చని నిరూపించడానికి చేపట్టారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు చెల్లుబాటు అవుతుంది. https://nuego.in/booking వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ ఆఫర్‌ను పొందేందుకు ఇప్పటికే చాలా మంది బుకింగ్‌లు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఈ సేవలు కొనసాగుతున్నాయని దేవేంద్ర చావ్లా వెల్లడించారు. ఈ ఆఫర్ ఆగస్టు 15న దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
Whatsapp Screen Sharing: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మీ స్క్రీన్‌ను ఇతరులతో షేర్