Anne Hathaway : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్,కొమరం భీం గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్ మరియు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ సాధించింది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ వేత్తలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also :Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా!
దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు.అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఆస్కార్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు దక్కింది.ఈ సినిమాతో ఎన్టీఆర్,రాంచరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా మారారు.సినిమాలో వీరిద్దరి నటనకు ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా ఆస్కార్ విన్నింగ్ నటి అన్నే హత్వే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది. ది ఐడియా ఆఫ్ యూ ప్రీమియర్ షోలో ఆమె మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ అందరిలాగే నాకు కూడా నచ్చింది. ఈ మూవీ ఒక అద్భుతం. ఆర్‌ఆర్‌ఆర్ టీంతో కలిసి పనిచేయడం ఒక కల అని ఆమె చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.