Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth Receives UAE Golden Visa: సౌత్ ఇండియన్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు.
వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని ప్రత్యేకంగా సత్కరించేందుకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తోంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వీసా కాలపరిమి 10 ఏళ్లు. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఇప్పటికే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ అరుదైన వీసా పొందిన అనంతరం రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు. వీసా విధివిధానాలను నిర్వహించినందుకు లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!
ఈ పర్యటన సందర్భంగా అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును రజనీకాంత్ సందర్శించారు. అంతేకాదు దేశంలోనే అతిపెద్దదైన బాప్స్ హిందూ దేవాలయంను సందర్శించారు. అంతకుముందు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. డీటీసీ చైర్మన్ యూసఫ్ అలీ నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్.. వెకేషన్ కోసం యూఏఈ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో డీటీసీ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందజేసింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!