Kothapalli Geetha: అరకు ఎంపీ సీటు బీజేపీకి తలనొప్పిగా మారింది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న కొత్తపల్లి గీతకు టికెట్ ఇవ్వద్దంటూ ఆ ప్రాంత వాసులే తేల్చిచెబుతుండడం.. పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే అక్కడ సమస్యల పరిష్కారంలో ముందుంటున్న డాక్టర్ హేమానాయక్ కు సీటివ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డాక్టర్ కూడా సీటు కోసం అంతే ప్రయత్నాలు చేస్తున్నారట.. డాక్టర్ హేమానాయక్ ఆదివాసీ తెగకు చెందిన వాడు కావడం.. స్ధానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తుండటంతో అక్కడి వారంతా అతనికే సీటివ్వాలంటున్నారు..
Read Also: CM Revanth Reddy Vizag Tour: నేడు విశాఖలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన..
స్ధానికంగా అరకు ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడంతో చాలా కాలంగా ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. ఇప్పుడు బిజెపి తీసుకునే నిర్ణయం పార్టీకి కూడా బలం చేకూరుస్తుందని కేడర్ చెబుతోంది. బిజెపి 400 ఎంపి స్ధానాల టార్గెట్ పెట్టుకోవడంతో టిడిపితో పొత్తులోకి వచ్చింది.. అయితే టిడిపి బ్యాక్ గ్రౌండ్ కూడ కొత్తపల్లి గీతకు ఉండటంతో అది ఆమెకు బిజెపి టికెట్ ను దూరం చేస్తుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. బిజెపి ఎంపీగా పోటీ చేయాలంటే మొదటి అర్హత ఆ వ్యక్తి పూర్తిస్థాయి బిజెపి వ్యక్తి కావడం.. పదుల సంవత్సరాలుగా బిజెపి నే నమ్ముకుని పని చేస్తున్న డాక్టర్ హేమానాయక్ కు సీటివ్వాలని స్ధానిక బిజెపి క్యాడర్ ఆశించడం వెనుక ఆ కారణం కూడా ఉందని అంటున్నారు… కొత్తపల్లి గీతకు నిరసన సెగ ఎక్కువ కావడంతో ఆ అంశంపై బిజెపి అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం..
Read Also: Andhra Pradesh: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. స్వస్థలానికి మృతదేహం..
కొంతకాలంగా గిరిజనులకు సేవచేస్తున్న గిరిజన డాక్టర్ హేమానాయక్ కు సీటిస్తే పూర్తి మద్దతు ఇస్తామని కూడా కేడర్ చెపుతుండటం బిజెపిని ఆలోచనలో పడేసింది.. తమ సమస్యలపై పోరాడే హేమానాయక్‌ను పార్లమెంటుకు పంపాలని స్థానిక గిరిజనులు, బీజేపీ కేడర్ కోరుతోంది. బిజెపి, జనసేన, టిడిపి పొత్తులో భాగంగా అరకు సీటు బిజెపి కి కేటాయించడంతో… ఇప్పుడు ఆ సీటు అసలు సిసలైన గిరిజనులకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు అరకు ప్రజలు.. అంతే కాకుండా లంబాడి తెగ నుంచీ ఒక వ్యక్తిని పార్లమెంటుకు పంపితే బిజెపి కి కూడా ఏపీలో కొంత పట్టు వస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది.. ప్రస్తుతం ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న కొత్తపల్లి గీతకు టికెట్ దక్కుతుందా.. గిరిజన వ్యక్తులకే టికెట్ ఇవ్వాలన్న నినాదాన్ని హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందా..? ఇవే ప్రశ్నలు ఆయా సామాజిక వర్గాలను వేధిస్తున్నాయి.