Jallikattu Protest: తమిళనాడు రాష్ట్రం క్రిష్టగిరి జిల్లాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గోబాచంద్రలో జల్లికట్టు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు – చెన్నై జాతీయ రహదారిపై నిరసనకు దిగన యువకులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ఓ మహిళా ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. గాయలపాలైన పోలీసులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ బస్సులు, మూడు పోలీసు వాహనాలను స్థానికులు, యువకులు ధ్వంసం చేశారు.
Read Also: Nellore: కొత్త అల్లుడికి పసందైన విందు.. 108 రకాలతో గుర్తుండిపోయేలా..
మరోవైపు హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపైకి వేలాది మంది యువకురావడంతో వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో క్రిష్ణగిరి నుండి స్పెషల్ పోలీస్ ఫోర్సును జిల్లా అధికారులు తరలించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బలగాలు ప్రయత్నించాయి. రాళ్ల దాడి చేసిన గ్రామస్థులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టాయి. ఈ దాడిలో 20మందికి పైగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు వేలాది మంది పోలీసులతో ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..
ఇది ఇలా ఉండగా, జల్లికట్టు నిర్వాహకులతో చర్చించారు క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్ జయచంద్ర భాను రెడ్డి, ఎస్పీ సరోజ కుమార్ టాకూర్… అనంతరం జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇచ్చారు.