తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. 45 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. మరో 19 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వాటిలో నాలుగు స్థానాలను సీపీఐ, సీపీఎంలకు కేటాయించనుంది.