Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. ఇక చూస్తూ చూస్తూనే ఇందిరా దేవి మొదటి సంవత్సరీకం కూడా వచ్చేసింది. నేడు ఈ కార్యక్రమాన్నీ ఘట్టమనేని ఇంట ఘనంగా జరిపించారు. ఇక ఇన్ని విషాదాల తరువాత ఘట్టమనేని ఇంట ఒక శుభకార్యం జరగనుందని సమాచారం అందుతుంది. అదే సితార ఓణీల ఫంక్షన్. ప్రతి ఆడపిల్లకు జరిగే మొట్ట మొదటి పండుగ. ఇందిరా దేవి బ్రతికి ఉన్నప్పుడే సితారకు ఓణీల ఫంక్షన్ చేయాలనీ కోరుకున్నారట. కానీ, మహేష్.. ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయాడు.
Nani: సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా..
Also Read
ఇక దీంతో తల్లి చివరి కోరిక అదే అని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మహేష్ చేయనున్నారట. సితూ పాపకు ఇప్పుడు 11 ఏళ్లు. ఇక ఇదే కరెక్ట్ వయస్సు అని మహేష్ ఈ ఫంక్షన్ చేయనున్నాడని సమాచారం. ఘట్టమనేని కుటుంబం మొత్తం ఈ ఫంక్షన్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇక సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటినుంచి ఆమె చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సితూ పాప సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ముందు ముందు సితార హీరోయిన్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!