Parenting Tips: పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిని పెంచుతుంది. దాని కారణంగా పిల్లలు పరీక్షా ఫోబియాకు గురవుతారు.పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. ఈ సమయంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అవుతుంది. పిల్లలకు మానసికంగా మద్దతుగా నిలవడమే కాకుండా.. వారికోసం పర్యావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మరి తల్లిదండ్రులు అంలాంటి కొన్ని ముఖ్యమైన టిప్స్‌ను అనుసరిస్తే సరి.
Also Read: Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ
* పిల్లలపై ఒత్తిడిని తగ్గించేలా వారితో స్నేహపూర్వకంగా మెలగండి. వాళ్లు ఎక్కడ ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారో తెలుసుకోండి. వారిని ప్రశంసించి, నెమ్మదిగా ప్రోత్సహించండి.
* పరీక్షల కోసం సమయం బాగా పంచుకోవడం నేర్పించండి. చదువు, విశ్రాంతి, ఆటపాటల కోసం సముచితంగా సమయం కేటాయించండి.
* పరీక్షల ఫలితాలు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవని పిల్లలకు అర్థం చేయండి. అప్పుడే వారు మంచి మార్కులు సాధించడంలో విజయం సాధిస్తారు.
* వాళ్లు చక్కగా చదవడానికి ప్రశాంతమైన వాతావరణం అందించండి. టీవీ, ఫోన్ వంటి ఆటంకాలను తగ్గించండి.
Also Read: SA20 2025: SA20 టీ20 లీగ్‌కు సర్వం సిద్ధం.. మ్యాచ్‌లను ఎక్కడ చూడచ్చంటే?
* పరీక్షల సమయంలో పిల్లలు సరైన ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం చాలా ముఖ్యమని వారికి గుర్తు చేయండి. వీటిని పాటించడంలో వారికి సహాయం చేయండి.
* వారి పనితీరు పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.
* పరుగు పోటీ భావనను పిల్లలకు కలిగించకండి. ప్రతి పిల్లవాడి ప్రత్యేకతను గుర్తించి వారిని అందుకు ప్రోత్సహించండి.
* పిల్లలు ఎక్కువసేపు చదువుతో బిజీగా ఉండకుండా మధ్య మధ్యలో చిన్న విరామాలను తీసుకోవడం అవసరం. ఇది వారి మానసిక నిశ్చలతను మెరుగుపరుస్తుంది.
ఈ సూచనలను పాటించడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల పరీక్షల సమయంలో వారికి మానసిక, శారీరక మద్దతును అందించవచ్చు.