Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి మోటో G05 ఒక అద్భుతమైన ఎంపికను తీసుక వచ్చింది. ఈ ఫోన్ గోరిల్లా గ్లాస్, 90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా, భారతీయ మార్కెట్‌లో తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G05ను విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదలైన మోటో G04 మొబైల్ అప్డేటెడ్ గా వచ్చింది. ఈ కొత్త ఫోన్ అనేక అప్‌గ్రేడ్లతో వస్తుంది. మెరుగైన కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్ వంటి అంశాలు మోటో G05 ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీనిలో పాంటోన్ (Pantone) క్యూరేట్ చేసిన ప్రత్యేక రంగులలో లభించే వెగన్ లెదర్ ఫినిషింగ్ కలిగి ఉంది.
Also Read: Leopard Catch: అరె ఏంది భయ్యా.. చిరుతపులిని అలా పట్టేసావ్.. (వీడియో)
ఇక మోటో G05 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గోరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉన్న డిస్‌ప్లే లభిస్తుంది. అలాగే MediaTek Helio G81 Extreme ప్రాసెసర్ కూడా లభిస్తుంది. మొబైల్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, పోర్ట్రెయిట్ మోడ్, ఆటో నైట్ విజన్ ఉండగా.. ముందర 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇక ఇందులో 5,200mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులో ఉంటుంది. అలాగే మొబైల్ ఆండ్రాయిడ్ 15, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లును పొందుతుంది. అలాగే IP52 రేటింగ్, Dolby Atmos సపోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, USB Type-C పోర్ట్ లాంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది.
Also Read: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
ఇక మొబైల్ ధర విషయానికి వస్తే.. మోటో G05 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999 మాత్రమే. ఇది ప్లమ్ రెడ్ (Plum Red), ఫారెస్ట్ గ్రీన్ (Forest Green) వంటి ఆకట్టుకునే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రంగులు కూడా వెగన్ లెదర్ ఫినిషింగ్‌తో లభిస్తాయి. మోటో G05 జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్కార్ట్ లో ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మోటో G05, తన సక్సెసర్ అయిన మోటో G04తో పోల్చితే పెద్ద డిస్‌ప్లే, మెరుగైన కెమెరాలు ఇంకా పెరిగిన పనితీరు వంటి అనేక ఇంప్రూవ్ మెంట్స్‌తో వస్తుంది. మోటో G05 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఉన్నప్పటికీ.. ఉన్నతమైన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా పనితీరు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.