OnePlus Buds Pro 3: సరికొత్త ఫీచర్లతో ఊహించని అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమైన వన్‌ప్లస్
- గ్రాండ్‌గా లాంచ్ అయిన వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3.
- మూడు కలర్ వేరియంట్స్ లో లభ్యం.
- వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ధర రూ.11,999.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Buds Pro 3: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ 2025, జనవరి 7న ఇండియాలో జరిగిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్ల రిలీజ్ ఈవెంట్‌లో తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిని డానిష్ ఆడియో దిగ్గజం డైనాడియో సహకారంతో రూపొందించారు. ఇందులో 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉండటం దీని ప్రత్యేకత. దీని స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో థియేటర్‌లో ఉన్న అనుభూతిని మనకి అందిస్తుంది. ఇక విడుదలైన ఒక్కొక్క ఇయర్‌బడ్‌లో 11mm డ్రైవర్, 6mm ట్వీటర్ కలిపిన డ్యూయల్-డ్రైవర్ సెటప్ ఉంది. రెండు డిజిటల్-టు-అనలాగ్ కన్వర్టర్లు (DACs) ద్వారా సౌండ్ మరింత స్పష్టంగా ఉంటుంది.
Also Read: Kangana Ranaut: ప్రియాంకా గాంధీ ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా చూడాలి.. కంగనా ఆహ్వానం..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3లో అధునాతన ‘స్టెడీ కనెక్ట్’ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా 360 మీటర్ల దూరంలో కూడా బ్లూటూత్ సిగ్నల్ పర్ఫెక్ట్‌గా అందుతుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో పాటు, గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఆప్షన్ ఉంది. అంతేకాకుండా, AI ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను అందించడంలో వన్‌ప్లస్ ఓ ముందడుగు వేసింది. వన్‌ప్లస్ 13 సిరీస్‌తో చక్కగా పనిచేసే ఈ ఫీచర్ ద్వారా వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నా కన్వర్జేషన్లు చాలా సులువుగా సాగుతాయి. ఇక వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ఏకంగా 43 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. వీటిని కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఏకంగా 5 గంటల పాటు వినియోగించుకోవచ్చు.
Also Read: Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
ఇక ఆడియో వాల్యూమ్ ను పెంచడానికి లేదా తగ్గించడానికి ఇయర్ బడ్ పై స్వైప్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ ను ప్లే చేయడానికి లేదా స్టాప్ చేయడానికి పిన్చ్ చేస్తే సరిపోతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌కు వెళ్ళడానికి మనం పిన్చ్ చేసి కాస్త హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న మిడ్‌నైట్ ఓపస్, లూనార్ రేడియన్స్ రంగులకు తోడుగా, కొత్త సఫైర్ బ్లూ కలర్ వేరియంట్ వినియోగదారులను ఆకట్టుకునెలా ఉంది. ఇది వన్‌ప్లస్ 13 సిగ్నేచర్ బ్లూ కలర్ మొబైల్ కు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇక ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 సఫైర్ వేరియంట్ ధర విషయైనికి వస్తే.. కంపెనీ రూ.11,999గా నిర్ణయించింది. జనవరి 10వ తేదీ నుంచి ఇవి వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలాగే రిటైల్ స్టోర్స్‌లో లభించనున్నాయి. IP55 వాటర్ రెసిస్టెన్స్ తోపాటు అదిరిపోయే సౌండ్ క్వాలిటీ ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!