Online Betting App: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై మోసాలకు గురికావద్దని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఒకవైపు హెచ్చరిక ఇస్తూనే వాటిపై అవగహన కల్పిస్తున్నారు. ఆయన ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలను తెలిపేందుకు ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో, ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లో రూ.వెయ్యి పెట్టుబడి పెడితే సెకెన్లలో లక్షలు సంపాదించుకోవచ్చని చెబుతున్నది. వాస్తవానికి ఇది పూర్తిగా అబద్ధం అని సజ్జనార్ స్పష్టంగా పేర్కొన్నారు. 99 రెట్లు లాభం వచ్చే అబద్ధపు ప్రకటనలు చూస్తే వాటిని నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Also Read: Daaku Maharaaj: తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ పై నాగ వంశీ కీలక ప్రకటన..
వీడియోలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు కొన్ని నకిలీ నోట్ల కట్టలను చూపిస్తున్నాయని, ఆ నోట్ల కట్టలు చూసి అత్యాశకు పోవద్దన్నారు. ఇలాంటి వాటిని నమ్మి ప్రజలు అనవసరంగా తమ సంపదను కోల్పోతున్నారని తెలిపారు. ఇదే సమయంలో, అత్యాశతో వారి జీవితాలు చెడిపోతున్నాయని సజ్జనార్ హెచ్చరించారు. అత్యాశకు పోవడం వల్ల చివరికి బాధ, దుఃఖమే మిగులుతాయని.. ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని ఆయన సూచించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండటం ఉత్తమమని ఆయన అన్నారు. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగాళ్లు గురించి మీకు సమాచారం ఉంటే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయండని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సజ్జనార్ ఈ విధంగా ప్రజలలో అవగాహన ఇవ్వడం, ఆన్‌లైన్ మోసాలపై అలెర్ట్ గా ఉంచేందుకు దోహదపడుతున్నారు.
వామ్మో..! రూ.వెయ్యి పెట్టుబడికి చిటికెలో రూ.లక్ష రాబడా!? అంటే 99 రెట్లు లాభమా?! ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా అసలు.
ఇలా నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోకండి. సోషల్ మీడియాలో మీ కంట పడే ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఏరి కోరి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడకండి.… pic.twitter.com/kmrYV12McP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 7, 2025