ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
Jammu Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడడం, రాళ్లు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక చోట్ల అధికారులు రహదారులన్నీ మూసివేశారు. దోడా జిల్లాలోని థాత్రి సబ్ డివిజన్‌లో క్లౌడ్ బరస్ట్ కావడంతో విపత్తు సంభవించింది. ఈ ఘటనలో 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కఠువా, కిశ్త్‌వాడ్‌లోనూ ఇటువంటి విపత్తులే సంభవించాయి. గతంలో కిష్త్వార్, థరాలిలో కూడా ఇలాంటి…
పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో ఒక మహిళ సహా నలుగురు పర్యాటకులు మృతిచెందారు.
నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. రసువా జిల్లాలో సరిహద్దుగా ఉన్న భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఊహించని రీతిలో ప్రళయం సంభవించింది. మిటేరి వంతెన, డ్రై పోర్టు దగ్గర నిలిపి ఉన్న వందలాది వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. టెక్సాస్ హిల్ కంట్రీలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలు కారణంగా 24 మంది మృతి చెందగా.. సమ్మర్ క్యాంప్ నుంచి 23 మంది పిల్లలు గల్లంతయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
Floods In Spain: దక్షిణ, తూర్పు స్పెయిన్ మంగళవారం వినాశకరమైన వరదలను ఎదుర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లో రికార్డు స్థాయిలో 12 అంగుళాల వర్షం కురిసింది. కుండపోత వర్షం విస్తృతమైన విధ్వంసానికి దారితీసింది. భారీ వర్షాల కారణంగా తూర్పు ప్రాంతంలో ఉన్న వాలెన్సియాలో వరదలు సంభవించాయి. భారీ వరదల కారణంగా రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మురికి నీరు వీధుల్లోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌ని భారీ వర్షాలు, మెరుపు వరదలు కలవరపెడుతున్నాయి. రుతుపవన వర్షాల కారణంగా సంభవిస్తున్న వరదలు దక్షిణ పాకిస్తాన్‌ని ముంచెత్తుతున్నాయి. జూలై 1 నుంచి వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 209కి పెరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారి ఇర్ఫాన్ అలీ తెలిపారు.