పంజాబ్‌లోని ఫజిల్కాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య.. కోపంతో అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొద్దామని.. అత్తగారింటికి వెళ్లిన భర్తపై అత్తమామలు దాడికి పాల్పడ్డారు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా కాలిపోయాడు. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్. 4లోని ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మూడు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో…