కుటుంబ కలహాలు, ఆస్తుల పంచాయితీలతో తల్లిదండ్రులపై పిల్లలు దాడులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పిల్లల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. తాజాగా ఉమానగర్, పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న యువకుడిని స్వంత తల్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హర్ష వర్ధన్ (27) గా పోలీసులు గుర్తించారు. ఆయన తల్లి గంగులమ్మ (50) ఇళ్లలో పనులు చేస్తూ…
Student Kills Classmate: తమిళనాడులో పెన్సిల్ గొడవ పెను సంచలనంగా మారింది. పెన్సిల్ కోసం 8వ తరగతి చదువుతున్న స్నేహితుల మధ్య గొడవ జరిగింది. పెన్సిల్ వివాదంతో తోటి విద్యార్థిని మరో స్నేహితుడు కొడవలితో నరికి చంపేశాడు.
మార్‌బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి రువాండాలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అలాగే.. చాలా మందికి ఈ వైరస్ సోకింది. ఈ 'బ్లీడింగ్ ఐ' వైరస్ తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువైతే కళ్ళు, ముక్కు లేదా నోటి నుండి రక్తస్రావం అవుతుంది.
తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్‌లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్‌లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేసింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో తలపై డంపుల్స్ తో కొట్టి హతమార్చాడు. నిందితుడు తుపాకుల సాయిగా గుర్తించారు. కాగా.. మృతురాలు తుపాకుల అరుణకుమారి. అయితే.. వీరి స్వస్థలం బొబ్బిలి. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అనపర్తి వచ్చి బతుకుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం కూడా ఉంది. కాగా.. తన తల్లి మరణంతో పిల్లలు తీవ్రంగా రోధిస్తున్నారు.
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్‌తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్‌లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్‌కాస్ట్ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్‌కాస్ట్‌ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్‌కాస్ట్‌ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నారని.. అది "Google TV స్ట్రీమర్"గా చెబుతున్నారు.
కర్ణాటకలోని యాదగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని పదహారేళ్ల యువతి దారుణానికి ఒడిగట్టింది. యువకుడి మూడు నెలల కోడలును బావిలో పడేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 6వ తేదీన జరిగింది. యువతికి పాప మేనమామ యల్లప్పతో గత రెండేళ్లుగా ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఐదుసార్లు ప్రపోజ్ కూడా చేసింది. అయితే.. యల్లప్ప తమ కుటుంబ సంబంధాల గురించి చెబుతూ పలుమార్లు ఆమె ప్రేమను తిరస్కరించాడు.
దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం…
ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. అయితే.. మహిళపై దాడి చేస్తుండగా చాలా మంది ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ ఆపడానికి సాహసించలేదు.. అలానే చూస్తూ ఉండిపోయారు.